పాల్వంచ మండల పరిధిలోని బొజ్జ తండా లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి,మండల విద్యాశాఖ అధికారి శ్రీరామ్ మూర్తి పునః ప్రారంభించారు.. ఈ పాఠశాల గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులు లేక మూతపడింది. మండల విద్యాశాఖ అధికారి బొజ్జ తండా గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించి ఆ ఆవాసంలో పాఠశాలకు వెళ్లగలిగే విద్యార్థులను గుర్తించడం జరిగింది.. బొజ్జ తండా పాఠశాల పున ప్రారంభించి పదిమంది విద్యార్థులను చేర్పించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి శ్రీరామ్ మూర్తి తెలిపారు.. పాఠశాల నిర్వహణకు ఒక ఉపాధ్యాయుని కేటాయించడం జరిగిందని తెలిపారు..