తమకు శాశ్వత గృహ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ నక్కల గిరిజనులు మంగళవారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా తమ బ్రతుకులు రోడ్ల మీదనే తెల్లారిపోతున్నాయని వారు వాపోయారు.20 ఏళ్ల క్రితం తమలో కొందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికీ గృహాలు కట్టించలేదని చెప్పారు. గతంలో ఇదే విషయమై తాము ఆందోళన నిర్వహించగా అధికారులు కంటి తుడుపు మాటలు చెప్పారన్నారు. ఈసారి కలెక్టర్ తమకు గృహాలు మంజూరు చేసే వరకు ఇక్కడనుండి కదలమన్నారు.