జిల్లాలో పండించిన ఉల్లి పంటను రైతులకు నష్టం వాటిల్లకుండా ఎపి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు.. జిల్లా యంత్రాంగం ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతోందని.. జిల్లా ఇంచార్జి కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా ఇంచార్జి కలెక్టర్, జేసీ అదితి సింగ్ అధ్యక్షతన.. ఎపి మార్క్ ఫెడ్ ద్వారా రైతుల నుండి నేరుగా ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి పంట కొనుగోలుకు సంబంధించి జిల్లాలోని ఉల్లి రైతులు, ట్రేడర్లతో సమావేశం ఏర్పాటు చేసి,వారి నుండి అభిప్రాయాలను స్వీకరించడం జరిగింది.