మదనపల్లెను జిల్లాగా వెంటనే ప్రకటించాలని బహుజన్ యువసేన సబ్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. సోమవారం పుణీత్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర గల, మదనపల్లె జిల్లాకు అన్ని అర్హతలు కలదని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ చిన్న హామీని నిలబెట్టుకుని వెంటనే మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలన్నారు. రాజకీయాల ప్రయోజనాల కోసం జిల్లాగా ప్రకటించకుండా మోసంచేయాలనిచుస్తే ఊరుకోం అన్నారు