నల్గొండ జిల్లా, నకిరేకల్ పట్టణ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ రేట్లను తగ్గించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పట్టణ బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం బిజెపి పట్టణ అధ్యక్షుడు గర్రె మురళి బిజెపి శ్రేణులతో కలిసి ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మధ్యతరగతి ప్రజలపై భారాన్ని తగ్గించడానికి స్లాబ్ రేట్ల తగ్గిస్తూ ప్రజాహితం కోసం ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.