నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో విద్యుత్ స్తంభం పైనుండి పెద్ద పెద్ద శబ్దాలతో దీపావళి టపాసులు మాదిరిగా గురువారం రాత్రి 9 గంటల సమయంలో వెలుగు వెలిగి, నిప్పు రవ్వలు వెదజల్లడంతో ప్రజలు తీవ్రభయాందోళనలు వ్యక్తం చేశారు. గ్రామంలోని ఇందిరా కాలనీలో ఉన్న రహదారి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం పై నుండి నిప్పు రవ్వలు రాలిపడటంతో సమీపములోని ప్రజలు ఆందోళన చెందారు. జరిగిన విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు స్థానికులు తెలియజేయగ విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు దీంతో గ్రామస్తులు ప్రశాంతంగా ఊపిరిపీల్చుకున్నారు. విద్యుత్ అధికారులు వైర్లు ఒకదానికి ఒకటి తగలడంతో ఈ ఘటన