జిల్లాలో తీరప్రాంత నియంత్రణ జోన్ ఉల్లంఘనపై అందిన ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ మరియు జిల్లాస్థాయి కమిటీ చైర్మన్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో తీరప్రాంత నియంత్రణ జోన్ ఉల్లంఘనకు సంబంధించిన మూడు అంశాలపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. నర్సపురంలోని వసిష్ట గోదావరి నది ఒడ్డున ఘన వ్యర్థాలను పారవేయడంపై చర్చించారు.