నల్గొండ జిల్లా, పెద్దవూర మండల కేంద్రంలోని పిఎసిఎస్ కేంద్రం వద్ద హోంగార్డు అత్యుత్సాహం ప్రదర్శించాడు. రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకున్నాడు. మంగళవారం ఉదయం రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న ఉష్యా నాయక్ యూరియా కోసం క్యూ లైన్ లలో బారులు తీరిన రైతులను లైన్లో నిలబెట్టే క్రమంలో ఐదుగురు రైతులపై చెయ్యి చేసుకున్నాడు. రైతులపై చేయి చేసుకున్న హోంగార్డు ఊష్యా నాయక్ ను విధుల నుండి తొలగించాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు.