సికింద్రాబాద్ సృష్టి కేసులో ప్రధాన నిందితురాలు డా. నమ్రతను పోలీసు కస్టడీకి ఇస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు అనుమతినిచ్చింది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు పదవ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ 5 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ తీర్పు వెల్లడించారు. సృష్టి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతకు 5 రోజుల కస్టడీ విధింపులో కీలక విషయాలు బయటకి రానున్నాయి.