చంద్రశేఖరపురం మండలంలోని చెన్నపు నాయిని పల్లి గ్రామానికి చెందిన 15 కుటుంబాల వారు శుక్రవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. టిడిపిలో చేరిన వారిని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పార్టీ కండువాలను కప్పి వారిని టిడిపిలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఎంతోమంది టిడిపిలోకి వచ్చి చేరుతున్నారు. టిడిపిలో చేరిన వారికి తగిన గుర్తింపునిచ్చి ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.