చంద్రగ్రహణం మోక్ష కాల అనంతరం రాజన్న గుడిలో ప్రత్యేక పూజలు ..దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో చంద్రగ్రహ మోక్షకాల అనంతరం సోమవారం ఉదయం సంప్రోక్షణ చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో సుప్రభాత సేవా,ప్రాతః కాల పూజ పూజా కార్యక్రమాలు చేసినట్లు అర్చకులు తెలిపారు. యధావిధిగా భక్తుల సౌకర్యాలతో అన్ని పూజలు మొక్కులు అందుబాటులో ఉంటాయని అర్చకులు గోపన్నగారి చందు తెలిపారు.