కరీంనగర్ లోని దీపిక హాస్పిటల్ లో అత్యాచారం జరిగిందని ఫిర్యాదు వచ్చిందని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో సోమవారం సిపి గౌష్ ఆలం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న దక్షిణామూర్తి అనే వ్యక్తి పేషెంట్ కు మత్తుమందు ఇచ్చి అగత్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారని తెలిపారు. హాస్పటల్ లోని గదిని పరిశీలించి ఆధారాలు స్వీకరించామన్నారు. సి సి ఫుటేజ్ ని కూడా పరిశీలించామన్నారు.