రెండు కార్లు ఢీకొని ఇద్దరు వ్యక్తులకు గాయాలైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో చికెన్ షాపు వద్ద ఆగి ఉన్న కారుని మరో కారు వచ్చి ఢీకొంది... ప్రమాదం జరిగిన సమయంలో చికెన్ షాప్ సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.. ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..