వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తనపై అక్రమ కేసులు పెట్టారని పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గుంటూరులో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఒక్క రాత్రి కురిసిన వర్షానికి పంట పొలాలు మునిగాయని చెప్పడం అబద్ధమని అన్నారు. కొండవీటి వాగును వెడల్పు చేయకపోవడం వల్ల ప్రతిసారి నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎన్ని కష్టాలు పడిన ఇప్పటివరకు ఎమ్మెల్యే పరామర్శించకపోవడం దారుణమని ఆరోపించారు.