ఒక వైపు రైతులు యూరియా కోసం రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే మరో వైపు మహిళలు తమ గ్రామ రోడ్లను బాగు చేయాలని రోడ్లపై నాట్లు వేసి తమ నిరసనను తెలుపుతున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చెట్లముప్పరం గ్రామంలో రోడ్లన్ని బురద మయంగా మారాయని ఎన్ని సార్లు అధికారులకు ప్రజా ప్రతినిధులకు తమ సమస్య తీర్చాలని మొరపెట్టుకున్నా ఒక్కరు కూడా స్పందించలేదని నేడు గ్రామంలో ఉన్న మహిళలు రోడ్లపై నాట్లు వేసి తమ నిరసనను తెలిపారు.పొలంలో వరి నాట్లు వేద్దామంటే ఎలాగో యూరియా లేదు.కనీసం ఏపుగా పెరిగిన వరి నారు రోడ్ల మీద తమ నిరసన తెలపడానికి ఐన పనికి వస్తుందని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.