జిల్లాలో డెంగ్యూ కేసులు అధికంగా నమోదవుతున్నాయని, జిల్లా వైద్య ఆరోగ్య, గ్రామపంచాయతీ, మున్సిపల్ శాఖల తో పాటు ఆయా మండల ప్రత్యేక అధికారులు అప్రమత్తం కావాలని ప్రజల్లో డెంగ్యూ బారిన పడకుండా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగ్రవాల్, అబ్దుల్ హమీద్ లతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... డెంగ్యూ కేసులు ఎక్కువ నమోదుఔతున్నాయి. డోర్ టు డోర్ అవేర్నెస్ తీసుకురావాలనీ ఫీవర్ సర్వే నిర్వహించాలని సీరియస్ గా పని