దేశానికి యువతే శక్తి అని ఈగిల్ టీమ్ సీఐ శివశంకర నాయక్ అన్నారు. సమాజ, దేశాభివృద్ధిలో యువత ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. సోమవారం సాయంత్రం పాడేరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ వీ.రమేష్ బాబుతో కలిసి డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.