హనుమంతునిపాడు: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 12 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున గిద్దలూరు కోర్టు జరిమానా విధించినట్లు హనుమంతునిపాడు ఎస్సై కే మాధవరావు సోమవారం తెలిపారు. హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 12 మందిపై కేసులు నమోదు చేసి గిద్దలూరు కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు. న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ. 10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని ఎస్సై వెల్లడించారు.