కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం గోరింట-పులిమేరు గ్రామాల మధ్యలో సామర్లకోట నుండి ప్రతిపాడు వెళ్లే రోడ్డులో కల్వర్టు కూలిపోవడంతో . గురువారం ఉదయం నుండి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. స్కూల్, కాలేజీలకు విద్యార్థులు, వాహనాలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వాహనాలు వల్ల కల్వర్టు కూలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. వెంటనే కల్వర్టు మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.