శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రహమత్పూర్ 16వ వార్డు లోని 3 పాఠశాలల సమీపంలో చెత్త డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల వలన కలుగుతున్న ప్రజల ఆరోగ్య సమస్యలపై సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(SDPI) నాయకులు మున్సిపల్ కమిషనర్ను కలసి సమస్యను వివరించి వినతి పత్రం అందజేశారు.పాఠశాలలకు అత్యంత సమీపంలో మునిసిపల్ డంపింగ్ పాయింట్ ఉండటంతో, దుర్వాసన, దోమల ఉధృతి మరియు అనారోగ్య వాతావరణం ఏర్పడుతోందని, దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది మరియు స్థానిక ప్రజలు శ్వాసకోశ వ్యాధులు, జ్వరాలు, చర్మ వ్యాధులు వంటి ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్నారని SDPI నాయకులు మున్సిపల్ కమిషనర్ కు తెలియజేశారు