విదేశీ పత్తి దిగుమతుల పై కేంద్ర ప్రభుత్వ సుంకాల తగ్గింపును ఉపసంహరించుకోవాలి తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, CITU ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆదివారం నగరంలోని ఎన్టీర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. అనతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నుర్జహాన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్ రాములు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వదేశీ పత్తి రైతులను నట్టేట ముంచడానికి పూనుకున్నదని విదేశీ పత్తి దిగుమతుల సుంకాలను 11% తగ్గించడానినీ,సుంకాల తగ్గింపులు వెంటనే విరమించుకావాలన్నారు.