కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో రూ. 60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న డయాలసిస్ కేంద్రం నిర్మాణ పనులను కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం పరిశీలించారు. డయాలసిస్ కేంద్ర నిర్మాణ పనులు నాణ్యతగా చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. డయాలసిస్ కేంద్రాల్లో ఏర్పాటు చేయబోయే వసతుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డయాలసిస్ కేంద్రంలో మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం పై చర్చించి, డయాలసిస్ రోగులకు లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.