రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి రెవెన్యూలో నడుస్తున్న కుందన కంపెనీ ముందు శుక్రవారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సిఐటియు చందనవెల్లి పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్, జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు. ప్రజలకు హాని కలిగించే ఈ పరిశ్రమను వెంటనే మూసివేయాలని వారు డిమాండ్ చేశారు.