మడకశిర పట్టణంలోని 4,7 వార్డుల్లో తాగనీరు రెండు నెలలుగా రావడం లేదని ఆ వార్డుకు సంబంధించి మహిళలు అనంతపురం, మడకశిర రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలు వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. అదే సమయంలో ఓ కానిస్టేబుల్ కార్లో చిన్న పాపను ఎక్కించుకొని అనంతపురం వెళుతుండగా నిరసన కారులు కానిస్టేబుల్ కు దారి ఇవ్వకపోవడంతో కొద్దిసేపు వాతావరణం వేడెక్కింది. అక్కడున్న కొంతమంది సర్ది చెప్పి కానిస్టేబుల్ కారుకు దారి వదిలేలా నిరసన కారులను ఒప్పించారు. శాంతిభద్రతలు కాపాడే కానిస్టేబుల్ కే దారి ఇవ్వకపోతే ఎలా అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.