మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి సొసైటీ వద్ద మంగళవారం మధ్యాహ్నం 12:00 లకు యూరియా కోసం లైన్ లో నిలబడిన ఆవుల నారాయణ అనే రైతుకు ఫిట్స్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు.. దింతో తక్షణమే స్పందించిన ఎస్సై రాజకుమార్ తన పోలీస్ వాహనంలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు.సకాలంలో ఆసుపత్రికి తరలించడం వల్ల రైతుకు ప్రాణాపాయం తప్పింది. ఫిట్స్ వచ్చిన వెంటనే స్పందించి, కొత్తగూడ వైద్యులకు ఫోన్ చేసి సరైన సమయంలో వైద్యం చేయించిన ఎస్సై రాజ్ కుమార్ ను పలువురు స్థానికులు అభినందించారు.