కృష్ణాజిల్లా పామర్రులో అశేష అభిమానుల మధ్య వైఎస్ఆర్సీపీ అభ్యర్థి,ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ రిటర్నింగ్ అధికారిణి శ్రీదేవికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈసందర్భంగా ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ తో కలసి భారీ ర్యాలీగా వైసీపీ కార్యాలయం నుండి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి,ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తరలివచ్చారు.ఈసందర్భంగా వైసిపి అభ్యర్థి కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన మహోన్నత వ్యక్తి వైఎస్ జగన్మోహనరెడ్డి అని,ఆయనను ప్రజలందరూ మరల ముఖ్యమంత్రిగా చేసుకుందుకు సిద్దంగా ఉన్నారు అని అన్నారు.