కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల విక్రయ కేంద్రాన్ని, గోదాం ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. నిలువలను, విక్రయాలను, స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. రైతుల సాగు భూమి విస్తీర్ణం ఆధారంగా ఎరువులను పంపిణీ చేయాలని, ప్రతి విక్రయాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రవేట్ డీలర్ల దగ్గర ఉన్న ఎరువుల నిల్వలను ఏ ఈ ఓ లు పరిశీలించి రైతులకు ఇప్పించాలని తెలిపారు.