అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి స్కేలు జీతం అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి వాసుదేవరావు డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఆందోళనలో భాగంగా గురువారం భీమవరంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనాలు అమలు చేయాలని, పని ఒత్తిడి తగ్గించాలని, ఎస్ఆర్ఎస్ రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ అంగన్వాడీలతో వెట్టి చాకిరీ చేయిస్తూ వారి సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు.