రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 9న ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహించనున్న అన్నదాత పోరును విజయవంతం చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పెదఅమీరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో సబ్సిడీపై విత్తనాలు, ఎరువుల పెట్టుబడికి రైతుభరోసా, ఇన్సూరెన్స్, గిట్టుబాటు ధరలు కూడా అందించామన్నారు.