గుత్తి మండలంలోని బేతాపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న సోలార్ కంపెనీకి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం పెంచాలని కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల రంగయ్య, సీపీఎం గుత్తి మండల కార్యదర్శి నిర్మల డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆర్అండ్ బీ అతిథి గృహంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైతు పక్షాన నిలవాల్సిన ఎమ్మెల్యే కంపెనీ పక్షాన నిలబడటం దుర్మార్గమని అన్నారు. రైతుల పక్షాన నిలిచిన వారిని బెదిరించడం సిగ్గు చేటన్నారు.