మాచారెడ్డి మండలం పోతారం గ్రామానికి చెందిన ఉప్పలవాయి నారాయణ 70 సంవత్సరాలు, పోతారం గ్రామ శివారులో గల ఊర చెరువు వద్ద శనివారం సాయంత్రం చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మరణించాడని ఎస్ఐ అనిల్ తెలిపారు. ఆదివారం తేలాడుతున్న మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. మాచారెడ్డి మరియు పాల్వంచ మండల ప్రజలు ఎవరు కూడా వాగుల వద్ద చేపలు, సెల్ఫీలు దిగడానికి వెళ్లకూడదని హెచ్చరించారు.