జిల్లా కేంద్రంగా బాపట్ల కొనసాగుతుందని,చీరాలకు తరలిపోయే ప్రసక్తి లేదని బాపట్ల టిడిపి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ స్పష్టం చేశారు.చీరాలకు జిల్లా కేంద్రం తరలిపోతుందని వైసీపీ నేతలు పుకార్లు సృష్టిస్తున్నారని ఆయన శనివారం మీడియాకు చెప్పారు.ఒకవేళ జిల్లా కేంద్రం చీరాలకు తరలిపోతే తాను ఎమ్మెల్యే పదవిలో కూడా ఉండనని పేర్కొన్నారు.ఈ తరహా వదంతులకు టిడిపి కూటమి శ్రేణులు తెరదించాలని నరేంద్ర వర్మ పిలుపునిచ్చారు.