ముదిగుబ్బ చిన్నేకుంటపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. శుక్రవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ధర్మవరం రైల్వే పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకొని పరిశీలించారు. చనిపోయిన వ్యక్తి శరీర భాగాలు చిత్రమై చల్లా చదరగా పడిపోయి గుర్తించలేని విధంగా భయానకమైన పరిస్థితి ఉంది.మృతుడి వివరాలు తెలిసినవారు ధర్మవరం రైల్వే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.