మారుమూల, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలోని పాల్ద గ్రామంలో పనుల జాతరలో భాగంగా 12 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న అంగన్వాడి భవన నిర్మాణానికి శుక్రవారం కలెక్టర్ ఆర్.వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.