తెలంగాణ రాష్ట్ర మాజీ ఎఫ్ డీ సి చైర్మన్,గజ్వేల్ నియోజకవర్గ బి అర్ ఎస్ పార్టీ ఇంచార్జీ వంటేరు ప్రతాప్ రెడ్డి తల్లి రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా.. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత శనివారం దౌలపూర్ లోని ప్రతాప్ రెడ్డి స్వగృహానికి చేరుకొని వజ్రమ్మ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మెదక్ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తదితరులు ఉన్నారు.