రైళ్లలో ప్రయాణిస్తూ నిద్రిస్తున్న వారి నుండి మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్న చెంగల్ రావు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఒంగోలు రైల్వే సీఐ షరీఫ్ శుక్రవారం సాయంత్రం మీడియాకు తెలిపారు.అతని వద్ద నుండి 12 ఖరీదైన ఫోన్లను స్వాధీనపరుచుకున్నట్లు చెప్పారు. గత కొంతకాలంగా రైళ్లలో మొబైల్ ఫోన్లు అపహరణకు గురవుతున్నట్లు అనేక ఫిర్యాదులు అందడంతో గట్టి నిఘా పెట్టి చంగల్ రావును అరెస్టు చేసినట్లు సిఐ వివరించారు.