లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు గ్రామపంచాయతీలో సోమవారం తెల్లవారగానే రజాక్ ఇంట్లోకి పాము చేరి కలకలం సృష్టించింది గత కొన్ని రోజులుగా పెంచు కుంటున్న కోళ్లను కాటు వేస్తూ చంపేస్తుంది.కోళ్ల శబ్దం విన్న యజమాని గమనించడంతో తాచుపాము బుసలు కొడుతూ పైకి లేచింది.వెంటనే ప్రాణధార ట్రస్ట్ సభ్యుడు సంతోష్ కు సమాచారం ఇవ్వగా వెంటనే వెళ్లి కోళ్ల గూడు మాటన నక్కి ఉన్న తాచుపామును చాకచక్యంగా పట్టుకుని బంధించి స్థానికులకు సర్పాలభద్రతపై అవగాహన కల్పించాడు. శ్రీనగర్ కాలనీ నాలుగవ లైన్ లో ఓఇంట్లో బాత్రూంలో తాచుపాము వచ్చిందని సమాచారంతో సంతోష్ వెళ్లి దానిని సైతం బంధించి వాటిని రిజర్వ్ ఫారెస్ట్ కు తరలించారు