నరసాపురం మండలం తూర్పు తాళ్ళు గ్రామంలో ఆదివారం రాత్రి గణేష్ నిమజ్జన యాత్రలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఈమన సూర్యనారాయణ, కడియం దినేష్, తిరుమల నరసింహమూర్తి, గురుజు మురళి కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ పొత్తురి రామరాజు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ కలిసి సోమవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటలకు పరామర్శించారు. బాధితుల భౌతిక గాయానికి పూలమాల వేసి, వారి కుటుంబ సభ్యులను బొమ్మిడి నాయకర్ ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.