చీమకుర్తి: అతివేగంగా వెళ్తున్న గ్రానైట్ లారీ కారును ఢీకొన్న సంఘటన చీమకుర్తి మండలం రామతీర్థం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రానైట్ లోడుతో వేగంగా వెళుతున్న లారీ రామతీర్థం వద్ద ఓ కారును ఢీ కొట్టింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రానైట్ లారీని సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.