జిల్లా అధికారులు ప్రజా సమస్యల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీ మీద అధికారులు చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ సెల్లో ఆమె నేరుగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.వాటన్నిటినీ సంబంధిత శాఖలకు ఎండార్స్ చేశారు. నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు