నల్గొండ జిల్లా, దామరచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో కలిసి గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్ లతోపాటు, మందుల స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు పాముకాటు, తేలుకాటుకు గురై ఆస్పత్రికి వస్తే యాంటీవీనం తెర మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వర్షాలు కురిసిన తర్వాత ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అందుకు సరిపడా మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అంతకుముందు వాడపల్లి చెక్పోస్ట్ ను తనిఖీ చేశారు.