చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంకు వచ్చి లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.దానిలో భాగంగా తొలుత నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం జరిపిన 27 మంది లబ్ధిదారులకు రాష్ట్ర రెవిన్యూ,గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన వస్త్రాలను పంపగా వాటిని శుక్రవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు.ఈసందర్భంగా నూతన వస్త్రాలు పంపిణీ కు వచ్చిన ఎమ్మెల్యే కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.ఎమ్మెల్యే ను శాలువతో సత్కరించారు.