నగరంలోని ఖలీల్వాడిలో వన్ వే ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ముదిరాజ్ గల్లి, ఖలీల్వాడిలోఅత్యధికంగా ఆస్పత్రులు ఉన్నాయి. అయితే చాలా ఆస్పత్రులకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రోగుల కోసం వచ్చే వారు, ఇతరులు రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో తరచూ ఖలీల్వాడిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక్కోసారి అంబులెన్స్ వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఏర్పడిన సందర్భాలున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సీపీ ప్రణాళిక రచించారు. పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి అత్యధికంగా ట్రాఫిక్ ఉండే ప్రాంతాలను వన్వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు.