పలమనేరు: పట్టణం రాధా బంగ్లా కాలనీ నందు కాపురం ఉంటున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు రామ్మూర్తి నాయుడు ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆయన కుమార్తె సౌజన్య తెలిపిన సమాచారం మేరకు. స్వంత పనుల నిమిత్తం బెంగళూరుకు వెళ్లి ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఇంటికి చేరుకోగా ఇంటి డోర్లు పగలగొట్టి ఉన్నారు ఇంట్లో ఉన్న సుమారు 600 గ్రాముల బంగారు నగలు దొంగలు ఎత్తుకెళ్లారని వాపోయారు. దీని విలువ సుమారు 70 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. సమాచారం అందుకున్న డిఎస్పీ డేగల ప్రభాకర్ సిఐ మురళీమోహన్ ఎస్ఐ లోకేష్ రెడ్డిలు ఘటన ప్రాంతానికి చేరుకొని చిత్తూరు నుండి క్లూస్ టీం రప్పించి దర్యాప్తు చేస్తున్నారు.