జాతీయ పశువ్యాధుల నియంత్రణ పథకం కింద ఈనెల 15వతేదీ నుండి నెల రోజులపాటు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను జిల్లా వ్యాప్తంగా ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాజాబాబు చెప్పారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆయన శనివారం ఆవిష్కరించారు.కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ పశువులకు సోకే వ్యాధుల్లో ప్రధానమైన గాలికుంటు వ్యాధిని అరికట్టడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని,పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.