జిల్లాలోని పలు దేవాలయాలలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్లతో సహా నలుగురు నిందితులను అచ్యుతాపురం పోలీసులు అరెస్టు చేశారు, శనివారం అచ్యుతాపురం సిఐ గణేష్ అందించిన వివరాలు ప్రకారం అచ్యుతాపురం, రాంబిల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని దేవాలయాలలో గత రెండు నెలలలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేస్తామని, వీరిలో ముగ్గురు మైనర్ బాలురు ఉన్నారని తెలిపారు.