సంతనూతలపాడు మండలంలోని మంగమూరు, ఎనికపాడు, ఏలూరి వారి పల్లి గ్రామాలకు నూతనంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఒంగోలు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.... ఈ గ్రామాలకు ఎప్పటి నుండో ప్రజలు ఆర్టీసీ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువచ్చారన్నారు. స్పందించిన ప్రభుత్వ ఈ మూడు గ్రామాలకు నూతనంగా ఆర్టిసి బస్సులను ఏర్పాటు చేసిందని, ఈ బస్సులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.