ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి శనివారం భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా రూ.33,11,228 ఆదాయం లభించిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి కిషోర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం 3 గంటల నుండి రాత్రి 10 గంటలు స్వామివారి ఆలయం మూసివేత వరకు ఈ ఆదాయం వచ్చిందని ఆయన తెలిపారు.