శ్రీశైలం జలాశయం 9 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ కు 2,23,119 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శ్రీశైలానికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గటంతో డ్యాం 10 గేట్లల్లో ఒక గేటుని గురువారం సాయంత్రం మూసివేశారు. ప్రస్తుతం 9 గేట్ల ద్వారా సాగర్కు నీటి విడుదల కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా 1,94,577 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. డ్యాం నీటిమట్టం 882 అడుగులుగా నమోదైంది