ఉల్లి రైతుల కష్టాలు తెలుసుకున్న ఆదోని సబ్ కలెక్టర్..గోనెగండ్ల పరిధిలోని వేముగోడు గ్రామంలో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గురువారం సాయంత్రం పర్యటించి తెలుసుకున్నారు. రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఏ ఒక్కరు అధైర్య పడకూడదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి కేజీ ₹12 చొప్పున కొనుగోలు చేస్తుందని, పంట కోత తర్వాత పొలంలోనే ఆరబెట్టుకోవాలని సూచించారు.